కరోనాని అరికట్టడంలో సీఎం విఫలం: బుద్దా
ABN , First Publish Date - 2020-04-01T09:09:10+05:30 IST
రేషన్ దుకాణాల వద్ద భారీ క్యూలైన్ల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘కరోనాను అరికట్టడంలో ముఖ్యమంత్రి జగన్ ఫెయిల్ అయ్యారని...

విజయవాడ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రేషన్ దుకాణాల వద్ద భారీ క్యూలైన్ల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘కరోనాను అరికట్టడంలో ముఖ్యమంత్రి జగన్ ఫెయిల్ అయ్యారని, అసమర్థుడని సన్న బియ్యం మంత్రి స్వయంగా ఒప్పుకొన్నారు. అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు రావాలి, కావాలి అంటున్నారు. కరోనాని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. సన్న బియ్యం మంత్రి బాఽధ చూస్తుంటే బాధేస్తోంది. తన శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియని అసమర్థ మంత్రి. రేషన్ షాపుల్లో రేషన్ ఇస్తామని ఆ శాఖ ప్రకటిస్తే.. సన్న బియ్యం మంత్రి ఇంటికే సరుకులు పంపుతామని ప్రకటించారు. ఆఖరికి ప్రజల్ని క్యూ లైన్లలో నిలబెట్టి ప్రాణాలు తీస్తున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది’’ అని బుద్దా ట్వీట్ చేశారు.