జూలై 7న కడప జిల్లాకు రానున్న సీఎం జగన్
ABN , First Publish Date - 2020-05-29T15:25:01+05:30 IST
జూలై 7న కడప జిల్లాకు రానున్న సీఎం జగన్

ట్రిపుల్‌ఐటీలో ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన
కడప/వేంపల్లె: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో జూలై 7వ తేదీ పర్యటించనున్నారు. ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన, రూ.90 కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాబ్‌కాంప్లెక్స్‌లను ప్రారంభిస్తారని ట్రిపుల్‌ఐటీ వర్గాలు తెలిపాయి. కడప ఎంపీ వైఎస్ అవినా్‌షరెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలు ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీని సందర్శించారు. ట్రిపుల్‌ఐటీ ఏఓ మోహన్‌కృష్ణ, ఇతర అధికారులతో సమీక్ష చేశారు. ట్రిపుల్‌ఐటీలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. జూలై 7వ తేదీ ముఖ్యమంత్రి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని అధికారులకు ఎంపీ తెలిపారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
కాగా 7వ తేదీ ట్రిపుల్‌ఐటీలో కార్యక్రమాల్లో పాల్గొనే సీఎం జగన్ తర్వాతి రోజు జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించనున్నట్లు తెలిసింది. సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించేందుకు ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి జూన్ మొదటి వారంలో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీకి రానున్నట్లు తెలిసింది.