రాజోలు వైసీపీలో రచ్చకెక్కిన విబేధాలు

ABN , First Publish Date - 2020-07-08T22:13:10+05:30 IST

రాజోలులో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో...

రాజోలు వైసీపీలో రచ్చకెక్కిన విబేధాలు

రాజమండ్రి: రాజోలులో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో వైసీపీలోని ఇరు వర్గాల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఇక్కడ బుధవారం జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు, ఎస్సీ మాల కార్పొరేషన్ చైన్మన్ అమ్మాజి, ఎంపీ అనురాధ, పార్లమెంట్ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అయితే బొంతు వర్గం, అమ్మాజీ వర్గం మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజేశ్వరరావు వర్గానికి చెందిన కార్యకర్తలు అమ్మాజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై కంటతడిపెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎంపీ అనురాధ, తోట త్రిమూర్తులు వెళ్లి అమ్మాజీని సముదాయించి మళ్లీ కార్యక్రమం వద్దకు తీసుకువచ్చారు.

Updated Date - 2020-07-08T22:13:10+05:30 IST