నేడు సివిల్స్ ప్రిలిమ్స్
ABN , First Publish Date - 2020-10-04T11:20:40+05:30 IST
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 30,199మంది అభ్యర్థులు హాజరు
అమరావతి: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 30,199మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి,అనంతపురం నగరాల్లోని 68 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందు కేంద్రాలకు చేరుకోవాలని ప్రభుత్వం సూచించింది. పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు గేట్లను మూసేస్తారని, ఆ తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా నేపథ్యం లో అభ్యర్థులంతా విధిగా మాస్క్/ఫేస్ కవర్ ధరించాలని సూచించింది.