అమరావతిలో అసైన్డ్‌ భూములపై ఐటీశాఖకు సీఐడీ లేఖ

ABN , First Publish Date - 2020-02-08T22:16:43+05:30 IST

అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలుపై రాద్ధాంతం జరుగున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భూముల కొనుగోలుపై విచారణ చేయాలని

అమరావతిలో అసైన్డ్‌ భూములపై ఐటీశాఖకు సీఐడీ లేఖ

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలుపై రాద్ధాంతం జరుగున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భూముల కొనుగోలులో నగదు లావాదేవీలపై విచారణ జరపాలని ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ లేఖ రాశారు. 2018 నుంచి 2019 వరకు 106 అనుమానాస్పద భూ లావాదేవీలు జరిగినట్లు ఈ లేఖలో సునీల్ తెలిపారు. వీటిలో రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఈ లావాదేవీలపై ఆదాయపు పన్ను చట్టం ప్రకారం విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను ఆయన కోరారు. దర్యాప్తు వివరాలను తమకు తెలియజేస్తే, తాము తదుపరి చర్యలను చట్టపరంగా తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా.. ఈ లేఖతో పాటు అసైన్డ్‌ భూముల  కొనుగోలులో ఉన్న 106 మంది వ్యక్తుల పూర్తి వివరాలు, అడ్రస్‌లు, భూముల సర్వే నెంబర్లతో సహా ఐటీ చీఫ్ కమీషనర్‌కు సీఐడీ పంపింది.



Updated Date - 2020-02-08T22:16:43+05:30 IST