నిమ్మగడ్డ లేఖ వ్యవహారంపై ఏబీఎన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా సీఐడీ డీజీ

ABN , First Publish Date - 2020-04-25T01:37:54+05:30 IST

కేంద్రానికి మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ విషయంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు చూస్తున్నాయి. .

నిమ్మగడ్డ లేఖ వ్యవహారంపై ఏబీఎన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా సీఐడీ డీజీ

అమరావతి : కేంద్రానికి మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ విషయంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు చూస్తున్నాయి. ఇవాళ సీఐడీ కూడా ఈ వ్యవహారంపై విచారణ చేసింది. అయితే విచారణలో ఏమేం చర్చించారు..? ఈ లేఖ విషయం ఎంతవరకు నిజం..? బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత..? వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఐడీ డీజీకి ఏమని లేఖ రాశారు..? ఇలా అన్ని విషయాలపై సీఐడీ డీజీ సునీల్ కుమార్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడి వివరాలు వెల్లడించారు.


సునీల్ కుమార్ మాటల్లోనే...

లేఖను తానే లాప్‌టాప్‌లో డ్రాప్ట్ చేసి పెన్‌డ్రైవ్ ద్వారా డెస్క్‌టాప్‌పై వేశానని..రమేష్ కుమార్ అడిషనల్ పీఎస్ సాంబశివమూర్తి తెలిపారు. రమేష్‌కుమార్‌ వాట్సాప్ ద్వారా కేంద్రానికి పంపారని సాంబమూర్తి చెప్పారు. లాప్‌టాప్‌లో ఫైల్ తొలగించడం, పెన్‌డ్రైవ్‌ ధ్వంసంపై దర్యాప్తు చేస్తున్నాం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నట్టు బయటి నుంచి ఈ లేఖ వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం. కాన్ఫిడెన్షియల్ లెటర్‌ను ఎందుకు డిలీట్‌ చేశారనే అంశంపై విచారణ చేస్తున్నాం. రమేష్ కుమార్ లేఖ తాను పంపించానని చెప్పిన విషయం వాస్తవమే. మీడియాలో వచ్చినప్పుడు కాన్ఫిడెన్షియల్ ఎలా అవుతుంది?అని సునీల్‌కుమార్ ఏబీఎన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా తెలిపారు.

Updated Date - 2020-04-25T01:37:54+05:30 IST