విధుల్లో చేరుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సీఐ
ABN , First Publish Date - 2020-12-05T21:05:48+05:30 IST
విధుల్లో చేరుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సీఐ
విశాఖ: 1995 బ్యాచ్కు చెందిన సీఐ రెడ్డి శ్రీనివాసరావు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. మూడు నెలలు క్రితం సీఐ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. డిసెంబర్ 8న తిరిగి విధుల్లో చేరుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. వడ్డాదిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేస్తుండగా సృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.