చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 13 మందికి జైలు శిక్ష
ABN , First Publish Date - 2020-03-27T20:24:07+05:30 IST
చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 13 మందికి జైలు శిక్ష
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన పదమూడు మందికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.1000 లు వంతున జరిమానా విధిస్తూ పీలేరు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 23న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రకటించిన లాక్‌డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించి పీలేరు టౌనులో వ్యాపారం నిర్వహించారు. పదమూడు మందితో పాటు ఆటో డ్రైవరుపై పీలేరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు వీరిని అరెస్ట్ చేసి పీలేరు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో నిబంధనలను ఉల్లంగించి వ్యాపారం నిర్వహించిన 13 మందికి పీలేరు కోర్టు రెండు రోజుల శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది.