చిత్తూరులో ఏనుగుల గుంపు భీభత్సం
ABN , First Publish Date - 2020-12-11T13:29:52+05:30 IST
శాంతిపురం మండలంలో మూడో రోజులుగా ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తున్నాయి.
చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం మండలంలో మూడో రోజులుగా ఏనుగుల గుంపు భీభత్సం సృష్టిస్తున్నాయి. కోనేరుకుప్పం, గొల్లప్పల్లి, వెంకేపల్లి, కృష్ణాపురం పరిసర గ్రామల్లోని రైతులు ఏనుగుల గుంపుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని కట్టడి చేయడానికి ప్రయత్నించినా విఫలం అవుతుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కర్నాటక రాష్ట్రం కామసముద్రం నుంచి అక్కడి ఫారెస్ట్ అధికారులు ఏనుగుల గుంపును ఆంధ్ర వైపు మళ్లించారు. ఏనుగుల గుంపు ఒక్కసారిగా పంటల మీద పడుతున్నాయి. దీంతో పంటలు పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపును తరమడానికి అనిమల్ ట్రాకర్స్ ను ప్రయత్నిస్తున్న ఫలించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.