-
-
Home » Andhra Pradesh » Chittoor District
-
ఇళ్ల పట్టాల కోసం వైసీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు
ABN , First Publish Date - 2020-12-30T21:00:46+05:30 IST
వైసీపీ ఇన్చార్జ్ కిషోర్ రెడ్డికి చెన్నంపల్లి గ్రామస్తులు చుక్కలు చూపించారు.

చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల వైసీపీ ఇన్చార్జ్ కిషోర్ రెడ్డికి చెన్నంపల్లి గ్రామస్తులు చుక్కలు చూపించారు. ఇంటిపట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని గ్రామస్తులు మండిపడ్డారు. నిజమైన అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కిషోర్ రెడ్డిని నిలదీశారు. దీంతో ఆయన సమాధానం చెప్పకుండానే కారులో వెనుదిరిగారు. కిషోర్ రెడ్డి తీరును గ్రామస్తులు తప్పుపడుతున్నారు.