చిత్తూరులో విషాదం

ABN , First Publish Date - 2020-06-23T00:26:27+05:30 IST

చిత్తూరులో విషాదం

చిత్తూరులో విషాదం

చిత్తూరు: జిల్లాలోని గుడిపాల మండలం ఏ‌ఎల్‌పురంలో  విషాదం చోటు చేసుకుంది. చికెన్‌లో చికెన్ మసాలా బదులు గుళికలు మందులు వేయడంతో అది తిన్న ఇద్దరు బాలురు మృతి చెందారు.  చిత్తూరు రూరల్ మండలం బ్రహ్మణపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇల్లు ఆయిన ఏఎల్ పురంకు వెళ్లారు. ఈ క్రమంలో వారికి చికెన్ వండిన పిల్లల అమ్మమ్మ అందులో చికెన్ మసాలాకు బదులు గుళికలు మందు వేసింది. ఇది తిన్న ఇద్దరు చిన్నారులు అపస్మారకస్థితిలోకి వెళ్లి మృతి చెందారు. అయితే మతిస్థిమితం లేని అమ్మమ్మ వంట చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-06-23T00:26:27+05:30 IST