చిత్తూరు: భార్యను హత్య చేసి...ఆపై భర్త ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-07-27T15:34:04+05:30 IST
చిత్తూరు: భార్యను హత్య చేసి...ఆపై భర్త ఆత్మహత్యాయత్నం

చిత్తూరు: జిల్లాలోని వి.కోట మండలం పాముగానిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. భార్య రేణుక (23)ను భర్త ప్రభాకర్‌రెడ్డి (35) హతమార్చాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నిందితుడు ప్రభాకర్ రెడ్డిని గ్రామస్తులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుటుంబకలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.