చీరాల వైసీపీలో మరోసారి బయటపడ్డ విభేదాలు

ABN , First Publish Date - 2020-12-31T00:36:05+05:30 IST

చీరాల వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఈసారి ఎమ్మెల్యే కరణం బలరాం వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత వంతైంది

చీరాల వైసీపీలో మరోసారి బయటపడ్డ విభేదాలు

ప్రకాశం: చీరాల వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఈసారి ఎమ్మెల్యే కరణం బలరాం వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత వంతైంది. వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఇరువురు నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇళ్ల పట్టాల పంపిణీకి సభ ఏర్పాటు చేసినా బయటే పట్టాలు పంపిణీ చేసి ఎమ్మెల్యే కరణం బలరాం వెళ్లి పోయారు. దీంతో పోతుల సునీత అవ్వాక్కయ్యారు. సభలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతని ఎమ్మెల్యే కరణం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. బలరాం తీరుపై పోతుల సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 


గత కొద్ది రోజులుగా చీరాల వైసీపీలో పాత-కొత్త నేతల మధ్య పొసగడం లేదు. బహిరంగంగానే ఇరువర్గాలు ఘర్షణలకు దిగుతున్నారు. కరణం బలరాం-పోతుల సునీత ఇద్దరూ టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి మద్దతు తెలిపారు. అయినా కూడా వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నట్లు తాజా ఉదంతంతో తేటతెల్లం అయింది. చీరాలలో నెలకొన్న ఘటనలపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.Updated Date - 2020-12-31T00:36:05+05:30 IST