సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా చింతా మోహన్
ABN , First Publish Date - 2020-09-12T13:31:25+05:30 IST
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ నియమితులయ్యారు.

తిరుపతి : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ నియమితులయ్యారు. గురువారం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీడబ్ల్యూసీలో ఆయనకు స్థానం కల్పిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో సీడబ్ల్యూసీలో పనిచేసిన ఆయన.. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. సీడబ్ల్యూసీలో రాష్ట్రం నుంచి ఆయనకు మాత్రమే చోటు దక్కింది.