తమ్మినేని, మంత్రి నాని మాట్లాడే తీరు దారుణం : చినరాజప్ప

ABN , First Publish Date - 2020-09-24T17:48:41+05:30 IST

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతూ కోర్టుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

తమ్మినేని, మంత్రి నాని మాట్లాడే తీరు దారుణం : చినరాజప్ప

కాకినాడ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతూ కోర్టుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఇక తిరుమల డిక్లరేషన్ గురించి మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్పీకర్‌ తమ్మినేని, మంత్రి నాని మాట్లాడిన వ్యాఖ్యలపై ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ ఆ ఇరువురిపై ధ్వజమెత్తారు.


తమ్మినేని, మంత్రి నాని మాట్లాడే తీరు దారుణంగా ఉందని చినరాజప్ప వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగనే మంత్రులతో అలా మాట్లాడిస్తున్నారని అనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని.. అందుకే చంద్రబాబును తిట్టడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. సామాన్యుల భూములు లాక్కుంటున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని సర్కార్‌పై చినరాజప్ప మండిపడ్డారు.


Updated Date - 2020-09-24T17:48:41+05:30 IST