మంత్రి కన్నబాబుపై మండిపడ్డ చినరాజప్ప

ABN , First Publish Date - 2020-09-17T01:58:43+05:30 IST

మంత్రి కన్నబాబుపై టీడీపీ నేత చినరాజప్ప మండిపడ్డారు. రైతుల సమస్యలు పక్కనబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడమే.. మంత్రి కన్నబాబు పనిగా పెట్టుకున్నారని

మంత్రి కన్నబాబుపై మండిపడ్డ చినరాజప్ప

హైదరాబాద్: మంత్రి కన్నబాబుపై టీడీపీ నేత చినరాజప్ప మండిపడ్డారు. రైతుల సమస్యలు పక్కనబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడమే.. మంత్రి కన్నబాబు పనిగా పెట్టుకున్నారని చినరాజప్ప మండిపడ్డారు. వరదల్లో రైతులు నష్టపోతే ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదన్నారు. రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మంత్రులుంటే ఎవరి పని వారిదేనని తప్పుబట్టారు. జిల్లాకు 6 నెలలుగా ఇరిగేషన్ ఏఈని ఎందుకు నియమించలేదు? అని చినరాజప్ప ప్రశ్నించారు.

Updated Date - 2020-09-17T01:58:43+05:30 IST