విశాఖలో వైసీపీ అరాచకం: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-11-25T09:09:11+05:30 IST

విశాఖ నగరంలో వైసీపీ సర్కారు అరాచకం సృష్టిస్తోందని, వారానికో టీడీపీ నేతను లక్ష్యంగా పెట్టుకుని భవనాలను కూలగొడుతోందని మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం

విశాఖలో వైసీపీ అరాచకం: చినరాజప్ప

విశాఖపట్నం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలో వైసీపీ సర్కారు అరాచకం సృష్టిస్తోందని, వారానికో టీడీపీ నేతను లక్ష్యంగా పెట్టుకుని భవనాలను కూలగొడుతోందని మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే సబ్బం హరి, శ్రీహర్ష, గీతం సంస్థలు, కాశీలకు చెందిన నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం కూలగొట్టిందని ఆరోపించారు. సీఎం జగన్‌ తన పార్టీకి చెందిన ఒక్కో నేతకు ఒక్కో జిల్లాను అప్పగించి దోచుకోవాలని చెప్పినట్టున్నారని నిప్పులుచెరిగారు. ఈ క్రమంలోనే విశాఖను విజయసాయిరెడ్డికి, తూర్పుగోదావరి జిల్లాను ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగించారని దుయ్యబట్టారు.

Read more