పశ్చిమగోదావరి జిల్లాలో బాల్య వివాహం కలకలం

ABN , First Publish Date - 2020-05-18T21:46:37+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో బాల్య వివాహం కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న బాలిక

పశ్చిమగోదావరి జిల్లాలో బాల్య వివాహం కలకలం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో బాల్య వివాహం కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న బాలిక (14) కు ఈ తెల్లవారుజామున తల్లిదండ్రులు వివాహం జరిపించారు. మైనర్ బాలిక‌కు వివాహం చేయడం చట్టరీత్యా నేరం అని.. ఈనెల 15న తల్లితండ్రులకు ఐసీడీఎస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తల్లిదండ్రులు పట్టించుకోకుండా.. బాలికకు పెళ్లి చేశారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. విచారణ అనంతరం బాలిక, పెండ్లి కుమారుడుల తల్లిదండ్రులపై లక్కవరం పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు  చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more