విఘ్నాలు తొలగిపోవాలి
ABN , First Publish Date - 2020-08-22T09:07:41+05:30 IST
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఎదురవుతోన్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి వైఎస్ ..
సీఎం జగన్మోహన్‌రెడ్డి
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఎదురవుతోన్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. సీఎంఓ శుక్రవారం ఆ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘‘రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలి. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలి’’ అని సీఎం జగన్ అభిలషించారు.