3.4 లక్షల బాటిళ్ల శానిటైజర్లు పంచిన చెవిరెడ్డి

ABN , First Publish Date - 2020-03-25T09:23:20+05:30 IST

కరోనా నిరోధక చర్యల్లో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం ఇంటికి రెండు శానిటైజర్లు చొప్పున...

3.4 లక్షల బాటిళ్ల శానిటైజర్లు పంచిన చెవిరెడ్డి

తిరుపతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా నిరోధక చర్యల్లో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం ఇంటికి రెండు శానిటైజర్లు చొప్పున పంపిణీ చేశారు. తన సొంత నగదుతో 3.4 లక్షల శానిటైజర్లను కొని నియోజకవర్గ ప్రజలకు ఆయన అందజేశారు. అలాగే ప్రతి పంచాయతీకి పది లీటర్ల శానిటైజర్లు, మెడికల్‌ కిట్లను అందించారు. ఈనెల 31న ఇంటింటికి మరొక శానిటైజర్‌ బాటిల్‌ చొప్పున అందిస్తామని చెవిరెడ్డి పేర్కొన్నారు. 

Read more