చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం వద్ద కార్మికుల ఆందోళన
ABN , First Publish Date - 2020-05-13T17:15:06+05:30 IST
గుంటూరు: దాచేపల్లిలోని చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. తమను సొంతూళ్లకు పంపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరు: దాచేపల్లిలోని చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. తమను సొంతూళ్లకు పంపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు అండగా స్దానిక వైసీపీ నేత ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. వైసీపీ నేతపై ఫ్యాక్టరీ సిబ్బంది దాడికి పాల్పడింది. వైసీపీ నేతకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీ వద్దకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఫ్యాక్టరీలో చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు.