విశాఖ: గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-11T16:42:10+05:30 IST

విశాఖ: ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ నేడు జరిగింది.

విశాఖ: గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

విశాఖ: ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ నేడు జరిగింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారాన్ని మంత్రులు అందజేశారు. నేడు కేజీహెచ్‌కు వెళ్లిన మంత్రులు 8 కుటుంబాలకు చెక్కులను అందజేశారు. చిన్నారి గ్రీష్మ తల్లికి సైతం రూ.కోటి చెక్కును అందజేశారు.


ఈ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతి, ధర్మాన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో 12 మంది మృతి చెందారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు చెక్కులు పంపిణీ చేశామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి అందించినట్టు తెలిపారు.

Updated Date - 2020-05-11T16:42:10+05:30 IST