అవ్వా, తాతలను మోసం చేస్తున్న జగన్: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2020-12-27T16:03:39+05:30 IST

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న‌పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అవ్వా, తాతలను మోసం చేస్తున్న జగన్: అయ్యన్నపాత్రుడు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న‌పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అవ్వా, తాతలను మోసం చేసిన జగన్‌కు నిద్ర ఎలా పడుతుందని ప్రశ్నించారు. సీఎం జగన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. పింఛన్ మూడు వేలు అన్నావ్.. కుర్చీ ఎక్కగానే తూచ్ అంటూ మాటమారుస్తున్నావ్ అని దుయ్యబట్టారు. మహామేత పెంచింది రూ.125, యువమేత పెంచింది రూ.250 అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో పెంచింది రూ.1750 అన్నారు. ఇప్పుడు చెప్పండి ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరూ సంక్షేమ సారధి’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

Updated Date - 2020-12-27T16:03:39+05:30 IST