ఐసెట్‌ సెంటర్‌ మార్చుకునేందుకు అవకాశం

ABN , First Publish Date - 2020-06-21T09:56:10+05:30 IST

ఏపీ ఐసెట్‌-2020 ప్రవేశ పరీక్షా కేంద్రం మార్పుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఐసెట్‌ సెంటర్‌ మార్చుకునేందుకు అవకాశం

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్‌ 20: ఏపీ ఐసెట్‌-2020 ప్రవేశ పరీక్షా కేంద్రం మార్పుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్లికేషన్‌ నంబరు, పుట్టిన తేదీ నమోదుచేసి పరీక్షా కేంద్రాన్ని మార్చుకునే వెసులుబాటు కల్పించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఖాళీ స్థానాలను అనుసరించి విద్యార్థుల అభ్యర్థనను అమోదిస్తామని చెప్పారు. ఈ నెల 24, 25 తేదీల్లో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు మార్చుకోవడానికి గడువు ఇస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-06-21T09:56:10+05:30 IST