‘ఉద్యాన’ పోస్టుల అర్హతల్లో మార్పులు
ABN , First Publish Date - 2020-09-20T09:12:22+05:30 IST
గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,783 విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టులకు గత నోటిఫికేషన్లో ఇచ్చిన విద్యార్హతల్లో

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,783 విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టులకు గత నోటిఫికేషన్లో ఇచ్చిన విద్యార్హతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐసీఏఆర్ గుర్తించిన నాలుగేళ్ల బీఎస్సీ (హార్టీకల్చర్) లేదా వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీ నుంచి రెండేళ్ల హార్టీకల్చర్ డిప్లొమో పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని స్పష్టం చేశారు. అవి కాకుండా మరే ఇతర అర్హతలూ ఈ పోస్టులకు చెల్లవన్నారు.