2018 నుంచి పీఆర్సీని అమలు చేయాలి: చంద్రశేఖర్ రెడ్డి

ABN , First Publish Date - 2020-12-29T19:36:02+05:30 IST

కడప: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2018 నుంచి పీఆర్సీ అమలు చేయాలని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

2018 నుంచి పీఆర్సీని అమలు చేయాలి: చంద్రశేఖర్ రెడ్డి

కడప: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2018 నుంచి పీఆర్సీ అమలు చేయాలని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. సీపీఎస్ రద్దు.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ బారిన పడిన ప్రభుత్వ ఉద్యోగులకు 28 రోజులు క్యా జువల్ లీవులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని... ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు జారీ చేసినా విశాఖపట్నం వెళ్లి పని చేస్తామని చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు మంచిది కాదన్నారు. కరోనా తగ్గే వరకూ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేయాలని ఎన్నికల సంఘాన్ని కలుస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-29T19:36:02+05:30 IST