గోరంట్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-03-15T16:23:04+05:30 IST

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

గోరంట్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా విష్ చేసిన ఆయన.. నిండైన ప్రజాజీవితాన్ని అందుకోడానికి భగవంతుడు.. సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాని అభిలాషించారు. 


మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తూ... రాజమండ్రి ప్రజల అభిమానాన్ని చూరగొన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరికి జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. శతాయుష్కులై.. ఆరోగ్య, ఆనందాలతో వర్ధిల్లాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.Updated Date - 2020-03-15T16:23:04+05:30 IST