ప్రపంచంలోని తెలుగువారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ABN , First Publish Date - 2020-11-13T22:14:18+05:30 IST
ప్రపంచంలోని తెలుగువారికి టీడీపీ అధినేత చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో హింసా, విధ్వంసాలకు చరమగీతం పాడిన రోజు..
అమరావతి: ప్రపంచంలోని తెలుగువారికి టీడీపీ అధినేత చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో హింసా, విధ్వంసాలకు చరమగీతం పాడిన రోజు.. బలహీనులపై దాడులు, దౌర్జన్యాలు అంతమైన శుభదినం అని వ్యాఖ్యానించారు. రాక్షసత్వంపై మానవత్వం విజయం సాధించిన పర్వదినమని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు ప్రజలకు సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. ప్రజల జీవితాల్లో దీపావళి కోటి కాంతులు నింపాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని జగన్ అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాలు దీపాలు వెలగాలని జగన్ ఆకాంక్షించారు.