చంద్రబాబుకు ఈ పాస్ మంజూరు

ABN , First Publish Date - 2020-05-25T03:37:28+05:30 IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ పాస్ మంజూరు చేశారు. లాక్ డౌన్...

చంద్రబాబుకు ఈ పాస్ మంజూరు

అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ పాస్ మంజూరు చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న తనకు.. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్  బాధితులను పరామర్శించేందుకు అనుమతి కావాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను చంద్రబాబు కోరారు. చంద్రబాబు విజ్ఞప్తిని పరిశీలించిన డీజీపీ.. విశాఖకు వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, పీఏ శ్రీనివాస్‌కు అనుమతించారు. గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన తర్వాత వీరు కారులో రోడ్డు మార్గాన అమరావతికి చేరుకుంటారు.  Updated Date - 2020-05-25T03:37:28+05:30 IST