చంద్రబాబు కృషి వల్లే ఏపీకి అగ్రస్థానం: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2020-09-06T20:23:13+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు కృషి వల్లే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీకి అగ్రస్థానంలో ఉందని మాజీమంత్రి కళా వెంకట్రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్‌ అధోగతిపాలు చేశారని

చంద్రబాబు కృషి వల్లే ఏపీకి అగ్రస్థానం: కళా వెంకట్రావు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు కృషి వల్లే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీకి అగ్రస్థానంలో ఉందని మాజీమంత్రి కళా వెంకట్రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్‌ అధోగతిపాలు చేశారని, 15 నెలల కాలంలో ఏపీకి ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగమైనా కల్పించారేమో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వ విధానాల వల్ల మొదటిస్థానం వచ్చిందని, వైసీపీ నేతలు డప్పు కొట్టుకుంటున్నారని వెంకట్రావు విమర్శించారు. అంవాఛనీయ, అవకాశవాద రాజకీయం ఏపీకి అనర్థదాయంగా మారిందని ఆరోపించారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని చంద్రబాబు తయారుచేశారని, అందుకే ఇప్పటికీ ఎంతోకొంత రుణాలు వస్తున్నాయని కళా వెంకట్రావు తెలిపారు.

Updated Date - 2020-09-06T20:23:13+05:30 IST