చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలి: మంత్రి వెలంపల్లి

ABN , First Publish Date - 2020-05-24T22:36:17+05:30 IST

చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలి: మంత్రి వెలంపల్లి

చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలి: మంత్రి వెలంపల్లి

విజయవాడ: టీడీపీ ఐదేళ్ల పాలపై, వైసీపీ ఏడాది పాలనపై చర్చకు తాము సిద్ధమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సవాల్ సవాల్ చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మితే జగన్ మోహన్ రెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావుకు ఒక్కరూపాయి కూడా రాదని మంత్రి స్పష్టం చేశారు. నియోజక వర్గంలో అన్ని మతాల వారికి అండగా ఉంటామని, ప్రజలను కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న వాడే నిజమైన నాయకుడని చెప్పారు. కోటి రూపాయల అభివృద్ధి పనులకు  దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి  శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. జగన్ మోహన్ రెడ్డి సంవత్సర పాలనలో అవినీతి తరిమికొట్టారని మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. 42 వ డివిజన్ లో కోటి రూపాయలు విలువ చేసే బీటీ,సీసీ,రోడ్ల పనులకు మంత్రి చేశారు. 


గత టీడీపీ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో విజయవాడ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక నగర అభివృద్ధి కి  నిధులు కేటాయించారని చెప్పారు. 100  కోట్ల ప్రత్యేక నిధులతోపాటు కృష్ణలంక కరకట్ట పనులకు 110 కోట్లు  కేటాయించారని, సీఎం జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు నిధులు విజయవాడకు కేటాయించడంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. పశ్చిమ లోని 22 డివిజన్లలో  సోషల్ డిస్టన్స్  పాటిస్తూ ప్రజలకు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. 


సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పక్క కరోనాపై  నియంత్రణ చర్యలు చేపడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందాలన్న మంచి లక్ష్యంతో పనిచేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. సీఎంగా సంవత్సరం కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమ పాలన అందిచారని, నియోజకవర్గంలోవాటర్ ,డ్రైనేజీ,శానిటేషన్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. పాలనలో అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్నామని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా  సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మ్యానిఫెస్టోని ఆన్ లైన్ లో తీసేసిన నాయకుడు చంద్రబాబు అని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్లక్ష్యం చేసిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి విమర్శించారు. మ్యానిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవత్గీతగా భావించిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని మంత్రి స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో 90 శాతం హామీలను అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి పేర్కొన్నారు.


టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మివేస్తుందంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. టీడీపీ హయాంలో టీటీడీ  చైర్మన్ గా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి సభ్యులుగా ఉన్నప్పుడే టీటీడీలో ఉపయోగం లేని భూములను ఆప్షన్ వేసేలా ఒక కమిటీ వేశారని మంత్రి గుర్తు చేశారు. 50 రకాల ఆస్తులను అమ్మలని గుర్తించారని మంత్రి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక టీటీడీలో ఏదో జరిగిపోతుందని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. టీటీడీ ఆస్తులు అమ్మితే జగన్మోహన్ రెడ్డికి, వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఒక్కరూపాయి కూడా రాదని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబు లా చీకటి జీవోలు ఇచ్చి అమ్మేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. 


టీటీడీ ఆస్తులు అమ్మినా డిపాజిట్లుగానే పొందుపరుస్తామని మంత్రి చెప్పారు. చంద్రబాబులా సదావర్తి భూమలు దొంగ చాటుగా వేలం వేసేలా, ఆలాంటి చర్యలు తమ ప్రభుత్వం చేయదని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. చంద్రబాబులా దోచుకోవాలనే ఆలోచన జగన్ మోహన్ రెడ్డికి లేదని, గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచిని సేకరిస్తామని, చెడును ఉపేక్షించమని మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు.


చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటే.. అప్షన్ లో పాల్గొని దేవుడి భూమిని ఎక్కువ డబ్బులకు కొంటే దేవుడికే ఆ డబ్బులు వస్తాయి, టీటీడీలో ఉపయోగం లేని భూములను ఆప్షన్ వేసేలా టీడీపీ హయాంలో ఒక  కమిటీ తీసుకువస్తే.. ఈనాడు ఆంధ్రజ్యోతి.. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని, చంద్రబాబు చేస్తే ఒప్పు.. జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పా అని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. తన పాలనలో దేవుళ్ల గుడులను కూల్చివేసిన నీచుడు చంద్రబాబు అని మంత్రి విమర్శించారు. తాము పవన్ కళ్యాణ్ లా ఫామ్ హౌస్ లో తాగి పడుకోవడంలేదని దేవదాయ శాఖ మంత్రి మండిపడ్డారు.


నియోజకవర్గంలో అన్ని మతాల వారికి అండగా ఉంటామని, ప్రజలను కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న వాడే నిజమైన నాయకుడని మంత్రి అన్నారు. చంద్రబాబు దమ్ము ఉంటే చర్చకు రావాలని, టీడీపీ ఐదేళ్ల పాలపై,  తమ ప్రభుత్వ సంవత్సర పాలనపై చర్చకు తాము సిద్ధమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సవాల్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సంవత్సర పాలనలో అవినీతిని తరిమికొట్టారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

Updated Date - 2020-05-24T22:36:17+05:30 IST