ఒక వైపు కరోనా బెడద.. మరోవైపు వైసీపీ బెడద: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-06-05T03:15:35+05:30 IST

ఏపీలో ఒక వైపు కరోనా బెడద ఉందని..మరో వైపు వైసీపీ బెడద ఉందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులను..

ఒక వైపు కరోనా బెడద.. మరోవైపు వైసీపీ బెడద: చంద్రబాబు

అమరావతి: ఏపీలో ఒక వైపు కరోనా బెడద ఉందని..మరో వైపు వైసీపీ బెడద ఉందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులను కూడా లెక్కచేయని స్థితికి చేరారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ఏడాది పాలనలో విచ్చలవిడిగా అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. పేదల సంక్షేమాన్ని కూడా వైసీపీ గద్దలే స్వాహా చేస్తున్నాయని మండపడ్డారు. ఏడాది గడిచినా గ్రామాల్లో ఇసుక దొరకడం లేదని, కార్మికులకు ఉపాది పోయిందని చెప్పారు. మద్యం ధరలు విచ్చలవిడిగా పెంచేసి నాసిరకం మద్యం అమ్ముతున్నారని చెప్పారు. అనేక నిబంధనలు, ఆంక్షలతో సంక్షేమానికి కోతలు పెట్టారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాడ్ అని, చెప్పేదంతా బోగస్ అని వైసీపీ నేతలే అంటున్నారన్నారు. ఏడాదిలో 800మంది టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-05T03:15:35+05:30 IST