అత్యాచార నిందితుల వెనుక వైసీపీ!

ABN , First Publish Date - 2020-10-08T08:26:14+05:30 IST

విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వాంబే కాలనీలో దళిత యువతిపై అత్యాచార ఘటనకు సంబంధించి టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఆదేశాలతో....

అత్యాచార నిందితుల వెనుక వైసీపీ!

గాజువాక ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ


గాజువాక, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వాంబే కాలనీలో దళిత యువతిపై అత్యాచార ఘటనకు సంబంధించి టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఆదేశాలతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. అత్యాచార ఘటనలపై దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతుంటే ఏపీలో మాత్రం అధికార పార్టీ నేతలు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కళా విమర్శించారు. సంఘటన జరిగిన గంటల వ్యవధిలో నిందితులను పట్టుకుంటామంటూ అసెంబ్లీలో జగన్‌ ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు అవేమీ అమలు కావడంలేదని అన్నారు. కాగా.. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యం చెప్పారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

Updated Date - 2020-10-08T08:26:14+05:30 IST