పోరాటాలకు మారు పేరు గౌతు లచ్చన్న: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-08-16T15:57:19+05:30 IST
పోరాటాలకు మారు పేరు గౌతు లచ్చన్న: చంద్రబాబు

అమరావతి: గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ట్విట్టర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడు, పోరాటాలకు మారు పేరు గౌతు లచ్చన్న అని కొనియాడారు. బ్రిటిష్ వారిపై తిరగబడ్డ "సర్దార్ లచ్చన్న"గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన తోటపల్లి బ్యారేజికి సర్దార్ గౌతు లచ్చన్న పేరుపెట్టి గౌరవించామని గుర్తుచేశారు.