బాబుకు గురుదక్షిణగానే వాయిదా: బొత్స

ABN , First Publish Date - 2020-03-16T08:51:03+05:30 IST

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భగవంతుడు కాదు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగితే నిలదీయవచ్చు, చర్యలు తీసుకోవచ్చు. కానీ, ఎన్నికలు వాయిదావేసే అధికారం ఆయన(ఎ్‌సఈసీ)కు

బాబుకు గురుదక్షిణగానే వాయిదా: బొత్స

విశాఖపట్నం/మచిలీపట్నం, మార్చి 15(ఆంధ్రజోతి):‘‘రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భగవంతుడు కాదు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగితే నిలదీయవచ్చు, చర్యలు తీసుకోవచ్చు. కానీ, ఎన్నికలు వాయిదావేసే అధికారం ఆయన(ఎ్‌సఈసీ)కు ఎవరిచ్చారు?’’ అని మంత్రి బొత్ససత్యనారాయణ, ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఆయనను(రమేశ్‌కుమార్‌) పదవిలో నియమించిన చంద్రబాబుకి, ఎన్నికల వాయిదాను గురుదక్షిణగా ఇచ్చారు’’ అని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇది ‘బ్లాక్‌ డే’ అన్నారు. ‘‘చంద్రబాబు చెవిలో చెప్పాడని, చంద్రబాబు, అతని బృందం ఇచ్చిన నోట్‌ను చదివేసి, ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు సంతకం పెట్టడం దారుణం’’ అని విమర్శించారు. రమేశ్‌ కుమార్‌ నిర్ణయంపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. కాగా, ‘‘రాష్ట్రానికి కరోనా వైరస్‌ సోకలేదు. కానీ, ఎలక్షన్‌ కమిషన్‌(ఎ్‌సఈసీ)కు, చంద్రబాబు వైరస్‌ సోకింది’’ అని మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో అన్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ఎన్నికలను నిలిపివేయడం దుర్మార్గమన్నారు.

Updated Date - 2020-03-16T08:51:03+05:30 IST