ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం

ABN , First Publish Date - 2020-03-02T23:52:10+05:30 IST

టీడీపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన తీర్పుపై భేటీలో చర్చించినట్లు సమాచారం.

ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం

అమరావతి: టీడీపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన తీర్పుపై భేటీలో చర్చించినట్లు సమాచారం. కోర్టు తీర్పుతో బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమైందని చంద్రబాబు చెప్పారు. రైతులకు అన్యాయం చేసేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనుకాడలేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో సమర్ధుడైన న్యాయవాదిని పెట్టకుండా ప్రభుత్వం కేసును నీరుగార్చిందని ఆయన దుయ్యబట్టారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని, సుప్రీంకోర్టుకు వెళ్తే టీడీపీ కూడా ఇంప్లీడ్‌ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-02T23:52:10+05:30 IST