జగన్‌ను సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-18T21:14:57+05:30 IST

సీఎం జగన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. దేవుడి కార్యక్రమానికి ఆంక్షలు.. మీ తండ్రి వర్దంతికి ప్రత్యేక జీవోలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

జగన్‌ను సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు

అమరావతి: సీఎం జగన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. దేవుడి కార్యక్రమానికి ఆంక్షలు.. మీ తండ్రి వర్దంతికి ప్రత్యేక జీవోలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నరసరావుపేట పార్లమెంటుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 16 నెలల వైసీపీ అవినీతి కుంభకోణాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ భూముల్లో వైసీపీ వన్‌సైడ్ ట్రేడింగ్.. నాసిరకం మద్యం బ్రాండ్ల వన్‌సైడ్ ట్రేడింగ్‌ సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. దాడులు, దౌర్జన్యాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైసీపీకి దూరమయ్యారని తెలిపారు. దేవాలయాలపై ఇన్ని అకృత్యాలు గతంలో ఎన్నడూ జరుగలేదని, మనుషులకే కాదు..దేవుళ్లకు కూడా వైసీపీ పాలనలో రక్షణ లేదని ఆయన తప్పుబట్టారు. పల్నాడులో వైసీపీ నేతల దుర్మార్గాలకు అంతే లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు.


Updated Date - 2020-09-18T21:14:57+05:30 IST