చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు: బొత్స

ABN , First Publish Date - 2020-07-19T22:35:28+05:30 IST

గవర్నర్‌ విశ్వభూషన్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖలో అన్ని సత్య దూరాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు.

చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు: బొత్స

అమరావతి: గవర్నర్‌ విశ్వభూషన్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖలో అన్ని సత్య దూరాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని అన్నారని, ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసమే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నామని బొత్స తెలిపారు. నీచమైన బుద్ధితో మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతిగా రాజధానిని ప్రకటించినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందారని పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని పచ్చిఅబద్ధాలు ఆడుతున్నారని, అబద్ధాలకు పేటెంట్ బాబుకే ఉందని దుయ్యబట్టారు. శివరామకృష్ణ కమిటీ ఎమి చెప్పిందో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందని ఆయన గుర్తుచేశారు. రాజధాని విషయంలో మాజీ మంత్రి నారాయణ కమిటీ ఆనాడు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని ఆరోపించారు. తాము చట్టానికి లోబడే చేస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2020-07-19T22:35:28+05:30 IST