తమిళనాడు సీఎం, కేంద్రహోంశాఖ కార్యదర్శికి చంద్రబాబు లేఖలు

ABN , First Publish Date - 2020-04-07T23:03:50+05:30 IST

తమిళనాడు సీఎం, కేంద్రహోంశాఖ కార్యదర్శికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు లేఖలు రాశారు.

తమిళనాడు సీఎం, కేంద్రహోంశాఖ కార్యదర్శికి చంద్రబాబు లేఖలు

అమరావతి: తమిళనాడు సీఎం, కేంద్రహోంశాఖ కార్యదర్శికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. తమిళనాడులో చిక్కుకున్న తెలుగువారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. చెన్నై, ఈరోడ్‌, తిరుపూర్‌, కాంచీపురం జిల్లాల్లో ఏపీకి చెందిన 2 వేల మంది మత్స్యకారులు, కూలీలు ఉన్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు.

Read more