-
-
Home » Andhra Pradesh » Chandrababu Naidu
-
అమరావతి దేశానికే గర్వకారణం: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-12-10T23:16:44+05:30 IST
అమరావతిని రాష్ట్రానికే కాకుండా దేశానికే చెరగని సంపదగా నిర్మించామని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

అమరావతి: అమరావతిని రాష్ట్రానికే కాకుండా దేశానికే చెరగని సంపదగా నిర్మించామని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. నూతన పార్లమెంట్ భవనానికి పునాదిరాయి వేసిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. స్వతంత్ర ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని ట్వీట్ చేశారు.