రామచంద్రరావు మృతికి చంద్రబాబు సంతాపం
ABN , First Publish Date - 2020-08-22T09:24:42+05:30 IST
సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అడ్వొకేట్ జనరల్‌గా, న్యాయవాదిగా రామచంద్రరావు విశేష సేవలు అందించారని, న్యాయశాస్త్రంలో ఆయన ప్రతిభ గొప్పదని చంద్రబాబు శ్లాఘించారు. రామచంద్రరావు కుటుంబ సభ్యులకు ఆయన తన సానుభూతి తెలిపారు.