గవర్నర్‌కు చంద్రబాబు లేఖ.. ఏపీని కాపాడాలంటూ వినతి

ABN , First Publish Date - 2020-07-19T14:52:38+05:30 IST

ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు.

గవర్నర్‌కు చంద్రబాబు లేఖ.. ఏపీని కాపాడాలంటూ వినతి

అమరావతి:  గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలంటూ ఆరు పేజీల లేఖలో విజ్ఞప్తి చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని ఆ లేఖలో ప్రస్తావించారు. శాసనమండలి ఈ బిల్లులను తిరస్కరించలేదని పేర్కొన్నారు. రెండు బిల్లులను కౌన్సిల్ సెలక్ట్ కమిటీకి సూచించిందని, మరోవైపు రాజధాని తరలింపు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-07-19T14:52:38+05:30 IST