‘చంద్రబాబు ఎక్కడున్నా ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు’
ABN , First Publish Date - 2020-04-26T17:57:38+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడున్నా..

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడున్నా కరోనా వైరస్ నివారణకు సంబంధించి తన బాధ్యత నిర్వహిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నారని టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రంలో విపత్కార పరిస్థితులు నెలకొన్నప్పుడు వాటిని అధిగమించి, ప్రజలను కాపాడే అనేక సందర్భాల్లో రుజువైందన్నారు. మార్చి 22న ప్రధానమంత్రి అత్యవసర లాక్ డౌన్ ప్రకటనతో హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు అక్కడే ఉండిపోయారని, అయినా ఆయన ఇంట్లో ఖాళీగా ఉండకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలకు కరోనాపై దిశా నిర్దేశం చేస్తున్నారని మాణిక్యాల రావు అన్నారు. ఎక్కడా రాజకీయాలు మాట్లాడవద్దని, కరోనా వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. అలాగే పేదలకు, కూలీలకు, వలస కార్మికులకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారన్నారు. ఏపీ ప్రతిపక్ష నేతగా వైసీపీ ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు.