జీజీహెచ్‌‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చంద్రబాబు ఫైర్

ABN , First Publish Date - 2020-08-11T21:43:53+05:30 IST

ప్రకాశం: ఒంగోలు జీజీహెచ్‌‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.

జీజీహెచ్‌‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చంద్రబాబు ఫైర్

ప్రకాశం: ఒంగోలు జీజీహెచ్‌‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. రోగి చనిపోయి రెండు రోజులు గడిచినా జీజీహెచ్‌ సిబ్బంది పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒంగోలు జీజీహెచ్‌‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.. రోగి చనిపోయి రెండు రోజులు గడిచినా జీజీహెచ్‌ సిబ్బంది పట్టించుకోలేదు. కుక్కలు మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. ఇతర రోగలను కరిస్తే పరిస్థితి ఏంటి? ఇది మృతులను తీవ్ర అగౌరవ పరచటమే.. ముమ్మాటీకీ రాష్ట్ర్ర ప్రభుత్వ వైఫల్యం.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


Updated Date - 2020-08-11T21:43:53+05:30 IST