కుప్పంకు నీళ్లు ఇవ్వకపోవడంపై చంద్రబాబు ఫైర్

ABN , First Publish Date - 2020-06-26T02:45:14+05:30 IST

ఏడాదిగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయని ...

కుప్పంకు నీళ్లు ఇవ్వకపోవడంపై చంద్రబాబు ఫైర్

అమరావతి: ఏడాదిగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయని చంద్రబాబు అన్నారు. కుప్పం టీడీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జగన్ ఏడాది పాలనలో జలవనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. టీడీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు నీళ్లిచ్చామన్నారు. చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడామని తెలిపారు. అలాంటిది కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకపోవడం రాజకీయ కక్ష సాధింపేనని చంద్రబాబు మండిపడ్డారు.


టీడీపీపై కక్షతోనో, వ్యక్తిగతంగా తనపై అక్కసుతోనో పనులు ఆపేసి ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడం కన్నా దుర్మార్గ చర్య మరొకటి ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 10 శాతం మందికి ఆర్ధిక సాయం ఇచ్చి 90 శాతం మందికి ఎగ్గొట్టారని విమర్శించారు. అందరితోపాటు ఇచ్చే పథకాలను కూడా కార్పొరేషన్ల ఖర్చులో చూపించి ఆయా వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-26T02:45:14+05:30 IST