కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-03-16T23:06:24+05:30 IST

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. కరోనా ప్రభావంతో అనేక దేశాలు తమ సరిహద్దులు మూసేశాయని, యూరప్‌ నుంచి అమెరికా రాకుండా

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది: చంద్రబాబు

అమరావతి: కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. కరోనా ప్రభావంతో అనేక దేశాలు తమ సరిహద్దులు మూసేశాయని, యూరప్‌ నుంచి అమెరికా రాకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ముంబైలో 144 సెక్షన్‌ పెట్టారని, ఢిల్లీ ఆంక్షలు విధించారని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో వారానికి 3 రోజులే విచారణ ఉంటాయని తెలంగాణ హైకోర్టు చెప్పిందన్నారు. కరోనా వల్ల బెంగాల్‌లో స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని గుర్తుచేశారు. 

 

‘‘కరోనాను ప్రపంచ దేశాలన్నీ సీరియస్‌గా తీసుకున్నాయి. జగన్‌ మాత్రం కరోనాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పారసిటమాల్‌ వేసుకుంటే కరోనా తగ్గుందనే పరిస్థితికి వచ్చారు. బ్లీచింగ్ పౌడర్‌ వేస్తే సరిపోతుందని అంటారా? సీఎస్‌కు రాష్ట్రంపై అవగాహన ఉందా?  6770 మంది విదేశాల నుంచి ఏపీకి వచ్చారు. వీరందరికి వైద్యపరీక్షలు నిర్వహించారా? కరోనా తీవ్రత మీకు అర్ధమైందా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.


Updated Date - 2020-03-16T23:06:24+05:30 IST