-
-
Home » Andhra Pradesh » Chandrababu comments
-
ముంబై ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి
ABN , First Publish Date - 2020-10-31T18:53:23+05:30 IST
అమరావతి: ముంబై ఐఐటీ విద్యార్థులనుద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.

అమరావతి: ముంబై ఐఐటీ విద్యార్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో ముఖాముఖి నిర్వహించారు. అంతర్జాతీయ బిజినెస్ ఫెస్టివల్‌లో భాగంగా చంద్రబాబు ప్రసంగించారు. సైబరాబాద్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించానని ఆయన వెల్లడించారు. ఐటీ కంపెనీల కోసం ప్రపంచమంతా తిరిగానని పేర్కొన్నారు. తన ప్రణాళిక ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పుడు 4 శాతం జీడీపీ హైదరాబాద్ నుంచే వస్తోందన్నారు. ఎంతో ముందుచూపుతో విజన్-2020 రూపొందించానన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రెండంకెల వృద్ధిరేటు సాధించామన్నారు. వ్యవసాయంలోనూ 17 శాతం వృద్ధి రేటు సాధించామని వెల్లడించారు. టీడీపీ హయాంలో దేశ వృద్ధి రేటు కంటే 3.5శాతం ఎక్కువ సాధించామని చంద్రబాబు స్పష్టం చేశారు.