ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే..: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-10-03T18:17:15+05:30 IST

మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను కూల్చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని..

ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే..: చంద్రబాబు

అమరావతి: మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఏమిటీ సైకోయిజమంటూ మండిపడ్డారు. ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే.. ఇక సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులేనని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-10-03T18:17:15+05:30 IST