-
-
Home » Andhra Pradesh » chandrababu became teacher
-
టీచర్‌గా మారిన బాబు
ABN , First Publish Date - 2020-03-23T10:12:49+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో ‘జనతా కర్ఫ్యూ’ దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఆదివారం ఇళ్లలోనే గడిపారు. చంద్రబాబు తన కుటుంబంతో సహా హైదరాబాద్‌లో ఉన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో ‘జనతా కర్ఫ్యూ’ దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఆదివారం ఇళ్లలోనే గడిపారు. చంద్రబాబు తన కుటుంబంతో సహా హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన టీచర్‌గా మారి మనవడు దేవాన్ష్‌కు ఒక పుస్తకంలోని అంశాలను చదివి వివరించారు. సాయంత్రం ఐదు గంటలకు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, మనవడు దేవాన్ష్‌లతో కలిసి బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టారు. కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని చంద్రబాబు అభినందించారు. - అమరావతి, ఆంధ్రజ్యోతి