బండారు సత్యనారాయణ అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం
ABN , First Publish Date - 2020-07-08T21:18:10+05:30 IST
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వమనడమే టీడీపీ చేసిన నేరమా..

అమరావతి: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వమనడమే టీడీపీ చేసిన నేరమా..? అని ప్రశ్నించారు. ఇళ్లు కట్టి 13నెలలైనా పేదలకు ఇవ్వకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా.. అని నిలదీశారు. కట్టిన ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చూడటానికి టీడీపీ నేతలు వెళ్లడం నేరమా..? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి బండారుని పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధిస్తారా?.. రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలని, హౌసింగ్‌లో పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని చంద్రబాబు కోరారు.